RTC బస్సుకు తప్పిన ప్రమాదం
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పుత్తేరి నుంచి శ్రీకాళహస్తికి విద్యార్థులతో బయల్దేరిన ఆర్టీసీ బస్సు పునబాక కండ్రిగ సమీపంలో మలుపు వద్ద రోడ్డు పక్కన దిగబడింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డు సరిగా లేకపోవడం, వర్షాలకు భూమి నాని ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.