రైతులు ఒకేసారి ఒకే పంట వేయవద్దు: ఎమ్మెల్యే

రైతులు ఒకేసారి ఒకే పంట వేయవద్దు: ఎమ్మెల్యే

ATP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం కనగానపల్లి మండలం మామిళ్లపల్లిలో 'రైతన్న-మీకోసం' కార్యక్రమం నిర్వహించారు. రైతులంతా ఒకేసారి ఒకే రకం పంటలు సాగు చేసి నష్టపోవద్దని ఆమె సూచించారు. పంటలు తక్కువగా ఉన్నప్పుడే ధరలు బాగుంటాయని, ఈ విషయంలో అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.