VIDEO: కాణిపాకంలో సంకటహర చతుర్థి వేడుకలు

VIDEO: కాణిపాకంలో సంకటహర చతుర్థి వేడుకలు

CTR: కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆస్థాన మండపంలో శ్రీ స్వామివారి సంకటహర గణపతి వ్రతం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు బాలాజీ నాయుడు, రవి పాల్గొన్నారు.