మేడారం మహా జాతర సందర్భంగా ప్రత్యేక బస్సులు

మేడారం మహా జాతర సందర్భంగా ప్రత్యేక బస్సులు

HNK: మేడారం మహా జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ హన్మకొండ నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ నెల 16 నుంచి ఈ బస్సులు ప్రారంభమవుతాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి. విజయభాను తెలిపారు. హన్మకొండ నుంచి మేడారానికి ఉదయం 6.10 నుంచి రాత్రి 8.20 వరకు, మేడారం నుంచి హనుమకొండకు ఉదయం 5.45 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.