'విద్యార్థుల సామర్ధ్యాలు పెంచాలి'
SRPT: అనంతగిరి మండలంలోని మొగలాయి కోట, అనంతగిరి పాఠశాలలను శాంతినగర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎన్. శ్రీధర్ శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన విద్యార్థులతో తెలుగు, ఆంగ్లం చదివించి, రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వీరన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.