చిక్కడపల్లి చోరీ కేసును ఛేదించిన పోలీసులు

HYD: చిక్కడపల్లిలో ఆగస్టు 15న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 36 తులాల బంగారు ఆభరణాలు, రూ.35 వేల నగదు చోరీ జరగింది. సీసీ కెమెరాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కర్ణాటకకు చెందిన పాత నేరస్థుడు నేహామియాను, బంగారం అమ్మకానికి సహకరించిన చైతన్య సాయికుమార్‌ను అరెస్టు చేసి 25 తులాల బంగారం, రూ.23 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.