ఢిల్లీ పేలుడుపై ఒమర్ స్పందన
ఢిల్లీ పేలుడు ఘటనపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు. అమాయక ప్రజలను ఇంత దారుణంగా చంపడాన్ని ఏ మతం కూడా సమర్థించదని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందన్నారు. జమ్మూకశ్మీర్‌లోని ప్రతి నివాసి ఉగ్రవాది కాదని.. అలాగే ఉగ్రవాదులతో సంబంధాన్ని కలిగి ఉండడని గుర్తించుకోవాలని సూచించారు. ఇక్కడ శాంతి, సామరస్యాన్ని దెబ్బతీస్తుంది కొంతమందేనని చెప్పారు.