సహకార శాఖ ఉద్యోగులకు ఆడిట్‌పై శిక్షణ కార్యక్రమం
KNR: సహకార భవనంలో సహకార శాఖ ఉద్యోగులకు ఆడిట్‌పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. సహకార శాఖ సీనియర్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ శివ నాగేందర్ రెడ్డి ఉద్యోగులకు ఆడిట్ విధానాలు, లెక్కల నిర్వహణ, పారదర్శకత అవసరంపై వివరంగా అవగాహన కల్పించారు. సహకార సంఘాల్లో ఆర్థిక వ్యవహారాలు సక్రమంగా నిర్వహించేందుకు ఆడిట్ కీలకమని తెలిపారు.