RTPPలో గాయపడిన ఉద్యోగి మృతి

RTPPలో గాయపడిన ఉద్యోగి మృతి

KDP: RTPP ప్లాంట్‌లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్లాంట్ అటెండెంట్ త్యాగరాజు గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న త్యాగరాజు పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వేలూరు తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.