కందుకూరులో వైభవంగా సీతారాముల పట్టాభిషేకం

కందుకూరులో వైభవంగా సీతారాముల పట్టాభిషేకం

NLR: శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా కందుకూరు పెద్దబజారులో ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో ఆదివారం శ్రీ సీతారాముల పట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కార్యక్రమంలో పాల్గొని, శ్రీ సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ ఆగమ పండితులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందజేశారు.