లక్కీ డ్రాలో సర్పంచ్ పదవి
RR: కొందుర్గ్ మండలం చిన్న ఎల్కచెర్లలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా 212 ఓట్లు రావడంతో అధికారులు రీకౌంటింగ్ నిర్వహించారు. అప్పుడు కూడా సమాన ఓట్లు రావడంతో టాస్ వేశారు. దీంతో కాంగ్రెస్ మద్దతుదారు మరాఠి రాజ్‌కుమార్‌కు విజయం వరించింది. ఈ విజయం పట్ల కాంగ్రెస్ నాయకులు బాణా సంచా కాలుస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.