VIDEO: కన్నుల పండుగగా వీరప్పయ్య స్వామి వారి రథోత్సవం
MBNR: దేవరకద్ర మున్సిపాలిటీ కేంద్రంలో శ్రీసద్గురు వీరప్పయ్య స్వామి సప్తమహోత్సవంలో భాగంగా సోమవారం తెల్లవారుజామున శ్రీసద్గురు వీరప్పయ్య స్వామి రథోత్సవం కనులపండుగగా జరిగింది. ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన అనంతరం ఉత్సవ విగ్రహాన్ని రథంలో ప్రతిష్ఠించి పురవీధుల్లో ఊరేగిస్తున్నారు. పట్టణంలో భజనలతో భక్తి పారవశ్యం నెలకొంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.