పత్తికొండ అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే
KRNL: పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ తెలిపారు. సోమవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి పత్తికొండ చెరువును పరిశీలించి నీటి నిల్వలను సందర్శించారు. చెరువులోని ముళ్ల పొదలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా 68 చెరువులను నింపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.