జిల్లాలో IPL బెట్టింగ్ ముఠా అరెస్ట్
NLR: రాధేఎక్సే యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న 12 మంది నిందితులను దర్గామిట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.2.05 లక్షల నగదు, 13 ఫోన్లను స్వాధీనం చేసుకోగా, 28 బ్యాంక్ ఖాతాల్లోని రూ.37 లక్షల లావాదేవీలను జిల్లా ఎస్పీ డాక్టర్ ఆజిత వేజెడ్ల ఐపీఎస్ హోల్డ్ చేయించారు. బెట్టింగ్ సమాచారం కోసం 112 లేదా 9392903413కు కాల్ చేయాలని పోలీసులు కోరారు.