నాగిరెడ్డిపల్లిలో ఉపాధి హామీ పనులలో అవకతవకలు

నాగిరెడ్డిపల్లిలో ఉపాధి హామీ పనులలో అవకతవకలు

ప్రకాశం: కొనకనమిట్ల మండలంలోని నాగిరెడ్డిపల్లిలో ఉపాధి హామీ పనులలో అవకతవకలకు పాల్పడుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఓ వర్గానికి వారం రోజులు పాటు మస్టర్ వేసి మరో వర్గానికి రెండు రోజులు మాత్రమే మస్టర్ వేశారని తెలిపారు. ఇదేంటి అని అడిగితే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వాపోయారు. కావున అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.