VIDEO: దెబ్బతిన్న పంటలను పరిశీలించిన BJP నేతలు

BHPL: మహాదేవపూర్(M) అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్ కారణంగా ముంపునకు గురైన పత్తి పంటలను శుక్రవారం బీజేపీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు శేఖర్ పరిశీలించారు. అన్నారం, చండ్రుపల్లి గ్రామ పంచాయతీలలో 300 ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. శాశ్వత పరిష్కారంతో పాటు, నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.