ఎమ్మెల్యేకి వినతుల వెల్లువ

KDP: కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి శనివారం పాలగిరిలో పర్యటించారు. గ్రామస్థులు తమ సమస్యలను ఎమ్మెల్యేకి విన్నవించారు. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ల మంజూరుతో పాటు సచివాలయంలో సిబ్బంది నియామకంపై వినతి పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.