VIDEO: మండల వ్యాప్తంగా దంచి కొట్టిన వర్షం

SRPT: తుంగతుర్తి మండల వ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం వర్షం దంచి కొట్టింది. గతం మూడు, నాలుగు రోజులుగా వాతావరణం ఉక్కపోత, ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించింది. రైతులు వరి నార్లు వేసుకొని వర్షం కోసం ఎదురుచూస్తూ ఉండడంతో ఈ వర్షంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వర్షం మరోవైపు బోనాల పండగ ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.