వడగండ్ల వర్షం.. అపార నష్టం
ATP: ఆరుగాలం శ్రమించిన పంట అకాల వర్షానికి కరిగిపోయింది. వడగండ్ల వాన కన్నీళ్లను మిగిల్చింది. త్వరలోనే పంట కోతలు చేపట్టాలనుకున్న అన్నదాతల ఆశల గాలివానకు ఆవిరయ్యాయి. ఇటీవల కురిసిన వర్షానికి జిల్లాలో మామిడి, అరటి, పంటలు దెబ్బతిన్నాయి. రైతులు రూ.లక్షల్లో నష్టపోయారు. ప్రభుత్వం తక్షణమే వర్షాల వల్ల నష్ట పోయిన వారికి నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.