మచిలీపట్నంలో కుండపోత వర్షం

మచిలీపట్నంలో కుండపోత వర్షం

క‌ృష్ణా: బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ మధ్యాహ్నం మచిలీపట్నంలో కుండపోత వర్షం కురిసింది. శివగంగా ప్రాంతంలో  రోడ్లలన్నీ జలమయంగా మారిపోయాయి. గత కొద్దిరోజులుగా వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు ఒక్కసారిగా వర్షం కురవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.