ప్రభుత్వ ఆస్పత్రులపై భరోసా కల్పించాలి

TG: ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచాలని, మెరుగైన సేవలు అందించాలని అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహా సూచించారు. రాష్ట్రంలోని 202 ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య విధాన పరిషత్‌లోని 100 పడకల పైన ఉన్న ఆస్పత్రుల (40)ను దశలవారీగా బ్రాండింగ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, రోగులకు ఓపీ, ఐపీ పెంచాలని, సర్జరీలను సకాలంలో చేయాలన్నారు.