ALERT: రైతులే సైబర్ నేరగాళ్ల టార్గెట్

ALERT: రైతులే సైబర్ నేరగాళ్ల టార్గెట్

రైతుల భూములపై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. భూమి రిజిస్ట్రేషన్ వివరాలు అప్‌డేట్ చేసుకోవాలంటూ నకిలీ లింకులు పంపి.. వారి భూములను తమ పేరుతో రిజిస్టర్ చేసుకుంటున్నారు. తాజాగా దీని గురించి తెలంగాణ సైబర్ భద్రతా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి నకిలీ లింకుల మీద క్లిక్ చేయవద్దని సూచించారు. కేవలం అధికారిక వెబ్ సైట్లలో మాత్రమే వివరాలు చెక్ చేసుకోవాలని తెలిపారు.