'రైతులకు సకాలంలో యూరియా అందించాలి'

NDL: రైతాంగానికి సకాలంలో యూరియా అందుబాటులో ఉంచి రైతులను ఆదుకోవాలని సీపీఐ జిల్లా నాయకులు రఘురాంమూర్తి, పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు కోరారు స్థానిక తాహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తాసీల్దార్ శ్రీనివాసులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు శ్రమించి వేసుకున్న పంటకు యూరియా అందించాలన్నారు.