మద్యం మత్తులో కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన యువకుడు

మద్యం మత్తులో కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన యువకుడు

BHNG: పంతంగి వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆసిఫ్‌ను ఓ యువకుడు స్కూటీతో ఢీ కొట్టాడు. మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు HYD నుంచి చిట్యాల వైపు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.