పోచమ్మ గుడి దారి ఏర్పాటుకు భారీ నిధులు
JGL: వెల్కటూర్ మండలం పాతగూడూరు గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోంది. ఇచ్చిన మాట ప్రకారం శ్రీ పొనుగోటి శ్రీనివాసరావు (బాపు) గారు పోచమ్మ గుడి దారి ఏర్పాటుకు సుమారు రూ.18 లక్షల చెక్కును భూమి యజమాని సుంకిశాల శ్రీనివాస్ రావుకు అందజేశారు. దీంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.