తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా: కడియం
TG: బీఆర్ఎస్ పాలన నచ్చక.. కాంగ్రెస్‌లో చేరానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. తాను చిన్న తప్పు కూడా చేయలేదని.. తాను వీలైనంత వరకు నిజాయితీగా పని చేస్తానని తెలిపారు. తన అభిమానుల గౌరవాన్ని కాపాడుతానని.. కానీ తలవంపులు తీసుకొచ్చే పనులు చేయనని చెప్పారు. తాను తప్పు చేసినట్లు ఎవరైనా నిరూపిస్తే అప్పటికప్పుడు రాజీనామా చేస్తానని వెల్లడించారు.