VIDEO: పాఠశాలలకు ఆధునిక కంప్యూటర్లు అందజేత
WGL: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ముందడుగు వేసింది. రాయపర్తి మండలంలోని కొలన్‌పల్లి ఉన్నత పాఠశాలతో పాటు మరో 7 పాఠశాలలకు రూ. 3 లక్షల విలువగల కంప్యూటర్లు ఇవాళ అందజేశారు. ఫౌండేషన్ మేనేజర్ స్వాతి మాట్లాడుతూ.. విద్యార్థులకు ఆధునిక సాంకేతికాన్ని చేరవేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.