ప్రధాని మోదీతో ముగిసిన దోవల్ భేటీ

ప్రధాని మోదీతో ముగిసిన దోవల్ భేటీ

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశం ముగిసింది. ఈ భేటీ సుమారు గంటన్నర పాటు జరిగింది. సరిహద్దుల్లో తాజా పరిణామాలను దోవల్ ప్రధానికి వివరించారు. అంతకుముందు త్రివిధ దళాధిపతులతో దోవల్ భేటీ అయ్యారు. కాగా, భారత్‌-పాక్‌ మధ్య యుద్ధం తీవ్రతరం దాల్చడంతో ఈ వరుస భేటీలు ఉత్కంఠ రేపుతున్నాయి.