VIDEO: అగ్ని ప్రమాదంలో పూరి గుడిసె దగ్ధం

VIDEO: అగ్ని ప్రమాదంలో పూరి గుడిసె దగ్ధం

CTR: అగ్ని ప్రమాదంలో పూరి గుడిసె దగ్ధమైన సంఘటన పుంగనూరు మండలంలో శనివారం వేకువ జామున జరిగింది. బర్నేపల్లెలో మాధవికి చెందిన పూరి గుడిసెకు మంటలు అంటుకోవడంతో పుంగనూరు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో  సిబ్బంది అక్కడికి వెళ్లి మంటలను అదుపు చేశారు. ఇంట్లో దీపం కారణంగా ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో రూ. 1.50 లక్షల నష్టం వాటిల్లింది.