గంజాయి మత్తులో యువతిపై గ్యాంగ్ రేప్, హత్య?

గంజాయి మత్తులో యువతిపై గ్యాంగ్ రేప్, హత్య?

TG: వరంగల్(D) రాయపర్తి(M) ఏకే తండాలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో ఉన్న నలుగురు యువకులు స్నేహితురాలిపై(21) అత్యాచారం చేసి, చీరతో ఉరివేసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మృతదేహంతో జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, అప్పటివరకు పోస్టుమార్టం చేయనివ్వం అని కుటుంబ సభ్యులు తెగేసి చెప్పారు.