నర్సంపేటలో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు
WGL: నర్సంపేట పట్టణంలో ఇవాళ భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు నిర్వహించారు. టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్ కార్యక్రమంలో పాల్గొని నెహ్రూ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రిగా ఆయన చేసిన సేవలను స్మరించుకుని, బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.