VIDEO: 'ఈనెల 26న బైక్ ర్యాలీ విజయవంతం చేయండి'
మెదక్ జిల్లా కేంద్రంలో రజక సంఘం పట్టణ యువజన అధ్యక్షుడు బక్కవారి శివ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 26న చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా నుంచి వెల్కమ్ బోర్డు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రక్తదానం కార్యక్రమం అనంతరం ప్రముఖులకు సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు.