VIDEO: ముసురు వర్షం.. ఇంట్లోకి చేరిన నీరు

MNCL: జన్నారం మండల వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా ముసురు వర్షం కురుస్తుంది. దీంతో జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. కొన్ని గ్రామాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. రోడ్లు బురద మయంగా మారి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చింతగూడ గ్రామనికి చెందిన పున్నం బలక్క ఇంట్లోకి నీరు చేరడంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నీటిలో మునిగిపోయాయి.