లేటరైట్ తవ్వకాలను ఆపాలని మంత్రికి వినతి

అల్లూరి: స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని గిరిజన రైతులు తన కార్యాలయంలో శనివారం కలిశారు. గూడెంకొత్తవీధి మండలంలో లేటరైట్ తవ్వకాలను ఆపాలని గిరిజనులు వినతిపత్రం అందజేశారు. ఈ తవ్వకాల వల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు వనరుల ధ్వంసం అవుతాయని వారు మంత్రికి తెలిపారు. కలెక్టర్‌తో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటానని ఆమె గిరిజనులకు హామీ ఇచ్చారు.