'లేబర్ కోడ్స్ ను ఉపసంహరించుకోవాలి'
కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్‌ను ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి డిమాండ్ చేశారు. దీనికి వ్యతిరేకంగా బుధవారం పరవాడ సినిమా హాల్ జంక్షన్ వద్ద కార్మికులతో ఆందోళన నిర్వహించారు. కార్మికుల హక్కులను కాలరాసే లేబర్ కోడ్స్ వద్దన్నారు. కార్మిక సంఘాలతో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం ఏ విధంగా తీసుకుంటారని ప్రశ్నించారు.