పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

విజయనగరం: ధర్మపురిలోని ఎల్డీజే జూనియర్ కళాశాలలో జరుగుతున్న 'ఉల్లాస్/అక్షరాంధ్ర' ప్రాథమిక పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని, అభ్యాసకులు అందరూ హాజరయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. సాయంత్రం 5 గంటలు వరకు జరిగే ఈ పరీక్షకు అభ్యాసకులు అంతా హాజరు కావాలని సూచించారు.