రాకపోకలకు ఆటంకం.. పలువురిపై కేసులు నమోదు

KMM: రోడ్డుపై అడ్డంగా సామగ్రిలు ఉంచి ప్రజలకు వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న పలువురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై రామారావు తెలిపారు. వైరా పట్టణంలోని హనుమాన్ బజార్, సత్రంబజార్, గాంధీనగర్‌లోని వివిధ కాలనీలో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న వారు సామగ్రి రోడ్డుపైనే ఉంచి రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న 10మందిపై సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు.