పోలింగ్ కేంద్రాల్లోకి స్మార్ట్ ఫోన్‌లు నిషేదం..!
MBNR: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లోకి స్మార్ట్‌ఫోన్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లడం నిషేధం అని అధికారులు తెలిపారు. ఓటర్లు ఫోన్ తీసుకువస్తే, దాన్ని స్విచ్ ఆఫ్ చేసి భద్రతా సిబ్బంది లేదా పోలింగ్ సిబ్బందికి అప్పగించాలని పేర్కొన్నారు. గోప్యంగా ఓటు వేయడం కోసం ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.