చెవిటికలు రోడ్‌లో శుద్ధ వాగు వద్ద భారీగుంత
NTR: కంచికచర్ల నుండి చెవిటికల్లు వెళ్లే రహదారిలో బైపాస్ దాటిన తర్వాత శుద్ధ వాగు వద్ద భారీ గుంత ఏర్పడింది. ఈ గుంత కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు రహదారి దెబ్బతినడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణం స్పందించి గుంతను పూడ్చి రహదారిని మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు.