విధుల పట్ల అంకితభావాన్ని చాటుకున్న పోలీసులు
VSP: కంచరపాలెం పోలీసులు విధుల పట్ల తమ అంకితభావాన్ని చాటుకున్నారు. పీఎస్ పరిధిలో ఓ మహిళ కనిపించడం లేదని ఫిర్యాదు వచ్చింది. దీంతో అప్రమత్తమైన కంచరపాలెం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిరంతరాయంగా గాలించి సదరు మహిళ ఆచూకీ కనిపెట్టారు. అనంతరం కుటుంబ సభ్యులుకు అప్పగించారు. బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.