గండవరంలో నిర్వహించిన యూరియా కార్డులు పంపిణీ కార్యక్రమం
NLR: కొడవలూరు మండలంలోని గండవరం గ్రామంలో ఇవాళ యూరియా కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పౌరసరఫరాల శాఖ సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి విచ్చేశారు. అనంతరం అర్హులైన రైతులకు యూరియా కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏడీఏ అనిత, ఎంఏవో విజయలక్ష్మి, అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రసాద్ పాల్గొన్నారు.