'సింథటిక్ ట్రాక్ నిర్మాణ నిధులపై విచారణ చేపట్టాలి'

'సింథటిక్ ట్రాక్ నిర్మాణ నిధులపై విచారణ చేపట్టాలి'

KMM: ఖమ్మం సర్ధార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి మంజూరైన రూ.9 కోట్ల నిధులపై విచారణ చేయాలని CPM డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ డిమాండ్ చేశారు. సోమవారం ట్రాక్ నిర్మాణ పనులను స్థానిక CPM నాయకులతో పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ లాభాల కోసమే ఇంకా ప్రతిపాదనలు పంపుతున్నారని, ట్రాక్ నిధులపై, నాణ్యతపై అధికారులు విచారణ జరిపించాలన్నారు.