అంబేద్కర్‌కు నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు
HYD: అసెంబ్లీ ప్రాంగణంలో బీ.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డెప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వీరితో పాటు MLAలు, ఎమ్మెల్సీలు, కౌన్సిల్ సెక్రటరీ వి. నరసింహాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.