VIDEO: అంతరించిపోతున్న కళ.. ఆకట్టుకున్న తోలుబొమ్మలాట
కోనసీమ: ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి కరప గ్రామానికి చెందిన విఘ్నేశ్వర కళాకారుల బృందం వారిచే సుందరకాండ - తోలుబొమ్మలాటను ప్రదర్శించారు. అంతరించిపోతున్న ఈ కలను తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.