భార్య మందలించిందని భర్త ఆత్మహత్య
VZM: బొండపల్లి మండలంలోని రోళ్లవాక గ్రామంలో భార్య మందలించిందని భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు బొండపల్లి ఎస్సై మహేష్ ఆదివారం తెలిపారు. నెల్లిమర్ల మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన బెల్లాన సతీష్ (32)ను భార్య శాంతి మద్యం తాగొద్దని మందలించినందుకు మనస్థాపంతో సతీష్ పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.