లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో  హుండీ లెక్కింపు

ATP: ఉరవకొండ మండలం పెన్నోబలం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు జరిగింది అని ఆలయ ఈవో సాకే రమేష్ బాబు తెలిపారు. 48 రోజుల్లో రూ.10.96 లక్షల ఆదాయం వచ్చినట్టు చెప్పారు. హుండీలో 2 అమెరికన్ డాలర్లు, 2.6 కేజీల వెండి, 10 మిల్లీ గ్రాముల బంగారు వస్తువులు వచ్చాయి. సేవా సమితి, కెనరా బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.