సీఎం పర్యటన బందోబస్తుపై ఎస్పీ సమావేశం

సీఎం పర్యటన బందోబస్తుపై ఎస్పీ సమావేశం

ATP: యాడికి టీటీడీ కళ్యాణ మండపంలో ఆదివారం సీఎం పర్యటన బందోబస్తుపై పోలీసు అధికారులతో ఎస్పీ జగదీష్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పర్యటన ప్రశాంతంగా ముగిసేలా సమిష్టిగా పని చేయాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక రూట్ మ్యాప్‌ను అమలు చేశామన్నారు. వాహన రాకపోకలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.