'అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి'
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో రూ. 14 లక్షల నిధులతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రారంభించారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు అంగన్వాడీ కేంద్రాలను వినియోగించుకోవాలని, అక్కడ అందించే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.