తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారిని దర్శించడానికి 24 గంటల సమయం పడుతుండగా.. కంపార్టుమెంట్లన్నీ నిండటంతో భక్తులు కృష్ణతేజ సర్కిల్ వరకు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 68,754 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,569 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.68 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.