'నెయ్యి కొనుగోళ్లపై సమగ్ర విచారణ అవసరం'
ఉత్తర విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ తిరుపతితో పాటు అన్ని ఆలయాల్లో నెయ్యి కొనుగోళ్లపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. కిలోకు రూ.319 ధరకు నెయ్యి సరఫరా ఆర్డర్ ఇవ్వడం అధికారుల తప్పిదమని విమర్శిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో కల్తీ జరిగిందని అప్పటి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.